: సోమేష్ కుమార్ టీఆర్ఎస్ తొత్తులా పని చేస్తున్నారు: ఉత్తమ్ కుమార్


జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ టీఆర్ఎస్ తొత్తులా మారారని టీఎస్ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఓట్ల తొలగింపుపై ఎన్నికల కమిషనర్ ను కలిసి ఫిర్యాదు చేసిన సందర్భంగా హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, హైదరాబాదులో స్థిరపడిన సీమాంధ్రులకు చెందిన 4 లక్షల ఓట్లను సోమేష్ రద్దు చేశారని అన్నారు. గ్రేటర్ హైదరాబాదు పరిధిలోని మరో 25 లక్షల మంది ఓట్లు తొలగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారని ఆయన ఆరోపించారు. బోగస్ ఓట్లను తొలగిస్తే అభ్యంతరం లేదని తెలిపిన ఆయన, డోర్ లాక్, షిఫ్ట్ అంటూ పలువురి ఓట్లను తొలగిస్తున్నారని ఆయన విమర్శించారు. గ్రేటర్ ఎన్నికల జాబితా ఫైనల్ కు ముందు తెలంగాణ వారిని కాకుండా వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తిని పరిశీలకుడిగా నియమించాలని ఆయన డిమాండ్ చేశారు. ఓటర్ల తొలగింపు జాబితాను బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News