: స్వల్ప నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు


ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే నష్టాల్లోకి జారుకున్న స్టాక్ మార్కెట్లు నెమ్మదిగా కోలుకున్నాయి. యూరోపియన్ మార్కెట్ల సపోర్ట్ తో నష్టాలను పూడ్చుకున్నాయి. చివరకు స్వల్ప నష్టంతో మార్కెట్లు ముగిశాయి. నేటి ట్రేడింగ్ లో, సెన్సెక్స్ 26 పాయింట్ల నష్టంతో 26,193కు చేరుకుంది. నిఫ్టీ 5 పాయింట్లు కోల్పోయి 7,977కు చేరింది. బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్ స్టాక్స్ లాభాలను ఆర్జించాయి. ఇవాల్టి టాప్ గెయినర్స్... ఐడీబీఐ బ్యాంక్ (16.72%), జై ప్రకాష్ అసోసియేట్స్ (12.79%), షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (10.16%), టోరెంట్ పవర్ (8.74%), పొలారీస్ కన్సల్టింగ్ (8.05%). టాప్ లూజర్స్... మదర్సన్ సుమి సిస్టమ్స్ (-7.64%), సన్ రైజ్ ఏషియన్ (-4.97%), పీఎంసీ ఫిన్ కార్ప్ (-4.65%), క్రిసిల్ (-4.03%), హ్యాత్ వే కేబుల్ అండ్ డేటా (-4.00%).

  • Loading...

More Telugu News