: ప్రయాణికుడ్ని కదులుతున్న రైల్లోంచి తోసేసిన హిజ్రాలు


రైళ్లలో హిజ్రాల వేధింపులు మితిమీరుతున్నాయి. భిక్షాటన పేరిట రైలు బోగీలోకి వచ్చిన హిజ్రాలు, అడిగిన మొత్తం ఇవ్వలేదని ఓ యువకుడిని కదులుతున్న ట్రైన్ లోంచి తోసేసిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. వివేకా ఎక్స్ ప్రెస్ లో ఈ దారుణం చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లా నౌపడ రైల్వే స్టేషన్ సమీపంలో హిజ్రాలు అతడిని రైలు నుంచి కిందకి తోసేశారు. ఈ ఘటనలో బాధితుడు తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడు ఒడిశాకు చెందినవాడని స్థానికులు చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సిఉంది.

  • Loading...

More Telugu News