: రామ్ విలాస్ కు కొడుకు, అల్లుళ్ల మధ్య పోరు...బీజేపీకి రెట్టింపైన కష్టాలు


ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ బీహార్ ఎన్నికలు రక్తికడుతున్నాయి. సరైన గుర్తింపు ఇవ్వడం లేదని అలకబూనిన సమాజ్ వాదీ పార్టీ మహాకూటమి నుంచి వైదొలగితే, మహారాష్ట్రలో మిత్ర పక్షం శివసేన ఒంటరిగా బరిలో దిగి బీజేపీకి సవాలు విసురుతోంది. పటేల్ రిజర్వేషన్ కావాలంటూ హార్దిక్ పటేల్ బీహార్ లో నాలుగు ర్యాలీలకు ప్రణాళిక రచించడంతో బీజేపీకి తలనొప్పి మొదలయ్యింది. ఇంతలో మిత్రపక్షం ఎల్జేపీలో లుకలుకలు మొదలయ్యాయి. ఎల్జేపీ అధినేత రామ్ విలాస్ పాశ్వాన్ కుమారుడు, అల్లుడు మధ్య విభేదాలు తారస్థాయికి చేరడంతో మహాకూటమితో అంటకాగేందుకు పాశ్వాన్ అల్లుడు అనిల్ సాధూ తహతహలాడుతున్నాడు. ఈ నేపథ్యంలో మహాకూటమితో పొత్తుకోసం బేరసారాలకు దిగాడు. పొత్తు కుదిరితే ఎల్జేపీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందనేది విశ్లేషకుల అభిప్రాయం. కింది స్థాయిలో మంచి ఆదరణ ఉన్న అనిల్ సాధూను పాశ్వాన్ కుమారుడు, ఆ పార్టీ ఎంపీ చిరాగ్ పాశ్వాన్ ఘోరంగా అవమానించాడని సమాచారం. దీంతో ఎల్జేపీకి దూరంగా జరగనున్నాడు. ఈ చర్యతో, మిత్రపక్షాలు కలిసివస్తాయని భావించిన బీజేపీ, ఆయా పార్టీల్లోని తిరుగుబాటుదారులతో తీవ్రంగా ఇబ్బంది పడుతోంది.

  • Loading...

More Telugu News