: దాల్మియా కోరిక మేరకు ఆయన నేత్రాలు దానం


బీసీసీఐ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా నేత్రాలను దానం చేశారు. కోల్ కతాలోని 'వన్ముక్త ఐ బ్యాంక్'కు దాల్మియా నేత్రాలను అప్పగించారు. శుశృక్త ఐ ఫౌండేషన్ అండ్ రీసర్స్ సెంటర్ కు చెందిన ఓ విభాగమే ఈ వన్ముక్త ఐ బ్యాంక్. నేత్ర దానాల ద్వారా అంధత్వాన్ని రూపుమాపాలనే లక్ష్యంతో దాల్మియా కొన్ని సామాజిక కార్యక్రమాలను చేపట్టారని బీసీసీఐ ఓ స్టేట్ మెంట్ లో తెలిపింది. దాల్మియా చేపట్టిన ఈ కార్యక్రమాల పేర్లు 'క్రికెట్ ఫర్ లైఫ్ బియాండ్ డెత్' మరియు 'ఛాన్స్ ఆఫ్ సెకండ్ ఇన్నింగ్స్'. జగ్మోహన్ దాల్మియా నిన్న రాత్రి గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News