: టీఎస్ పీఎస్సీ పరీక్షలు పారదర్శకంగా నిర్వహిస్తాం: మంత్రి జగదీష్ రెడ్డి


తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ) నిర్వహించే పరీక్షలను పారదర్శకంగా నిర్వహిస్తామని, బ్రోకర్లకు ఆస్కారం లేకుండా చేస్తామని మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. 1422 కొత్త ఏఈ పోస్టులకు నేడు ప్రకటన ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈ ఉద్యోగాలకు సంబంధించి నిర్వహించే రాత పరీక్ష నవంబర్ 8వ తేదీన ఉంటుందని అన్నారు. డిసెంబర్ లోగా మొత్తం నియామకాల ప్రక్రియ పూర్తవుతుందని మంత్రి వివరించారు. తెలంగాణ జెన్ కో, ట్రాన్స్ కో సిబ్బంది గురించి కూడా ఆయన ప్రస్తావించారు. జెన్ కో, ట్రాన్స్ కో సిబ్బంది కష్టపడి పనిచేస్తున్నారని మెచ్చుకున్నారు. ప్రభుత్వం రైతు సంక్షేమానికి కృషి చేస్తోందని జగదీష్ రెడ్డి చెప్పారు.

  • Loading...

More Telugu News