: దాల్మియా మృతి తీరని లోటు: ఐసీసీ అధ్యక్షుడు


బీసీసీఐ అధ్యక్షుడు, అత్యుత్తమ స్పోర్ట్స్ మేనేజర్ గా ఖ్యాతి గడించిన జగ్మోహన్ దాల్మియా మరణం తీరని లోటు అని ఐసీసీ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ అన్నారు. క్రికెట్ కు ఆయన చేసిన సేవలు అసమానవైనవని, చిరస్థాయిగా నిలిచిపోతాయని చెప్పారు. దాల్మియా దూరదృష్టి వల్లే క్రికెట్ ఈ స్థాయికి చేరుకుందని తెలిపారు. తన జీవితం మొత్తాన్ని క్రికెట్ కే అంకితం చేసిన మహోన్నత వ్యక్తి దాల్మియా అంటూ ప్రశంసించారు. మన మధ్య దాల్మియా లేకపోవడం చాలా బాధ కలిగిస్తోందని అన్నారు. మరోవైపు, అభిమానులు కడసారి దర్శించుకునేందుకు వీలుగా, దాల్మియా భౌతికకాయాన్ని కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంకు తరలించారు.

  • Loading...

More Telugu News