: అర్హులుంటే ఇప్పటికైనా రుణమాఫీకి దరఖాస్తు చేసుకోవచ్చు: మంత్రి ప్రత్తిపాటి


ఏపీలో ఇంకా రుణమాఫీ కాని రైతులు ఎవరైనా ఉండి, అర్హత ఉంటే రుణమాఫీకి దరఖాస్తు చేసుకోవచ్చని వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఇంతవరకు రాష్ట్రంలో రూ.7,433 కోట్ల మేరకు రైతు రుణమాఫీ చేశామని చెప్పారు. కాకర పండించే రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని, పందిరిసాగు రైతులకు రాయితీ రూ.50 వేలకు పెంచేలా కృషి చేస్తామని పుల్లారావు తెలిపారు. టీడీపీ ఆధ్వర్యంలో చేపట్టిన రైతు చైతన్యయాత్ర ఈరోజు గుంటూరు జిల్లాలో నిర్వహించారు. ఇందులో భాగంగా నారా కోడూరు గ్రామంలోని పంట పొలాలను మంత్రులు, ఎమ్మెల్యేలు పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి మాట్లాడుతూ, నారా కోడూరు గ్రామంలో కోల్డ్ స్టోరేజీ ఏర్పాటు చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News