: రాహుల్ గాంధీ 'సూటు-బూటు' వ్యాఖ్యలపై వెంకయ్య మండిపాటు
కేంద్రంలో ఉన్నది సూటు-బూటు ప్రభుత్వం అంటూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రతిసారీ చేస్తున్న వ్యాఖ్యలను కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఖండించారు. రాహుల్ తండ్రి రాజీవ్ గాంధీ, తాత జవహర్ లాల్ నెహ్రూలు సూటు-బూటులు ధరించారు కదా? అని ప్రశ్నించారు. వారు ధరించిన దుస్తులను ఇప్పుడు అపహాస్యం చేస్తున్నారా? అని అడిగారు. ఆ విషయాన్ని విస్మరించి దేశ ప్రధానిని ఉద్దేశించి రాహుల్ అలా మాట్లాడటం సరికాదని సూచించారు. మోదీ ధరించిన సూటును వేలం పెట్టిన విషయాన్ని గుర్తుంచుకోవాలని వెంకయ్య తెలిపారు. చిన్న పిల్లవాడిలా, మెచ్యూరిటీ లేనట్టుగా రాహుల్ మాటలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. రాహుల్ కు ఉపన్యాసాలు రాసిపెట్టేవారు ఎవరోగానీ సరిగా లేరన్నారు.