: కల్తీ కల్లు తాగితే... 12 వారాల చికిత్స తప్పనిసరి: తెలంగాణ డ్రగ్ కంట్రోలర్ అకున్ సభర్వాల్


కల్తీ కల్లు తాగి తెలంగాణలో వందల సంఖ్యలో ఆసుపత్రి పాలవుతున్నారు. ఇప్పటికే పది మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వింత చేష్టలతో ఆసుపత్రుల్లో చేరుతున్న కల్తీ కల్లు బాధితులతో వేగలేక ఆయా ఆసుపత్రుల వైద్యులు, అక్కడి రోగులు నానా పాట్లు పడుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు కల్తీ కల్లు కారణంగా ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయన్న విషయంపై అటు వైద్యులకు గాని, ఇటు డ్రగ్ కంట్రోల్ అధికారులకు గాని స్పష్టమైన అవగాహన లేదనే చెప్పాలి. అయితే కల్తీ కల్లుతో ఇప్పటిదాకా జరిగిన నష్టంతో పాటు చికిత్సకు సంబంధించి తెలంగాణ డ్రగ్ కంట్రోలర్, సీనియర్ ఐపీఎస్ అధికారి అకున్ సభర్వాల్ మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. కల్తీ కల్లు కారణంగా రాష్ట్రంలో ఇప్పటిదాకా 700 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారని ఆయన తెలిపారు. కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురైతే, కనీసం 12 వారాల పాటు చికిత్స అవసరమని కూడా ఆయన పేర్కొన్నారు. కల్తీ కల్లు విక్రయాలు ఆదిలాబాదు, నిజామాబాదు, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో పెద్ద ఎత్తున సాగుతున్నాయని ఆయన తెలిపారు. కల్తీ కల్లు విక్రేతలపై పీడీ యాక్టు ప్రయోగిస్తామని ఆయన హెచ్చరించారు.

  • Loading...

More Telugu News