: పాక్, చైనాలతో సత్సంబంధాలు కోరుకుంటున్నాం: రాజ్ నాథ్


భారత్ సరిహద్దు దేశాలు పాకిస్థాన్, చైనాలతో సత్సంబంధాలు కోరుకుంటున్నామని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. పాక్ కు ఎల్లప్పుడూ స్నేహపూర్వక హస్తం అందిస్తామని చెప్పారు. దాన్ని ఆ దేశం అందిపుచ్చుకుని చర్యలు చేపట్టాలని కోరారు. మూడు రోజుల పర్యటన కోసం రాజ్ నాథ్ ఇవాళ జమ్ముకశ్మీర్ వెళ్లారు. ముందుగా సరిహద్దు జిల్లా సాంబకు వెళ్లిన ఆయన, అక్కడ ఐటీబీపీ కాంప్లెక్సును ప్రారంభించారు. సరిహద్దు భద్రతపై జవాన్లను ఆరా తీశారు. పాక్, చైనాలతో సహృద్భావ వాతావరణాన్ని పెంపొందించుకునేందుకు తామెప్పుడూ కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘన నేపథ్యంలో రాజ్ నాథ్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

  • Loading...

More Telugu News