: ఇందిర, రాజీవ్ స్టాంపుల రద్దుపై నిరసన... వీహెచ్ అరెస్ట్
మాజీ ప్రధానమంత్రులు ఇందిరాగాంధ్, రాజీవ్ గాంధీల చిత్రాలతో ముద్రించిన పోస్టల్ స్టాంపులను రద్దు చేయడంపై టీకాంగ్రెస్ నిప్పులు చెరిగింది. దేశం గర్వించదగ్గ నేతలకు ఇది అవమానం అంటూ నిరసన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో, అబిడ్స్ లోని జనరల్ పోస్ట్ ఆఫీస్ భవనం ఎదుట హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ నేతలు బైఠాయించి, ఆందోళన చేపట్టారు. దీంతో, పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనను విరమించాలని నేతలను కోరారు. అయినప్పటికీ వారు వినకపోవడంతో... ఎంపీ వి.హనుమంతరావు, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, కార్తీక్ రెడ్డి తదితరులను అరెస్ట్ చేశారు.