: అక్టోబర్ 13 నుంచి పైడితల్లి ఉత్సవాలు


ఉత్తరాంధ్రలో అత్యంత ఘనంగా జరిగే పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు అక్టోబర్ 13న ప్రారంభం కానున్నాయి. నెల రోజుల పాటు కొనసాగే ఈ ఉత్సవాలు నవంబర్ 11వ తేదీ వరకు జరుగుతాయి. ఈ వివరాలను ఆలయ ఈవో భానురాజ్ వెల్లడించారు. ఉత్సవాల సందర్భంగా లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, అన్ని ఏర్పాట్లను చేస్తామని చెప్పారు. అక్టోబర్ 26న తోలేళ్ల ఉత్సవం, 27న సిరిమానోత్సవం, నవంబర్ 3న తెప్పోత్సవం, 10న ఉయ్యాల కంబాల, 11న చంఢీయాగం, పూర్ణాహుతి, దీక్ష విరమణ కార్యక్రమాలు ఉంటాయని ఈవో తెలిపారు.

  • Loading...

More Telugu News