: ఓట్ల తొలగింపుపై సీఈసీకి టి.కాంగ్రెస్ ఫిర్యాదు
హైదరాబాదులోని సనత్ నగర్ నియోజవర్గంలో ఓట్ల తొలగింపు అంశం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషన్ కు చేరింది. ఈ మేరకు కమిషన్ ను కలసిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఓట్ల తొలగింపుపై ఫిర్యాదు చేశారు. జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాల్లో లక్షల ఓట్ల తొలగింపుపై టి.కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఇప్పటికే ఎన్నికల కమిషనర్ భన్వర్ లాల్ ను కలసి ఫిర్యాదు కూడా చేశారు.