: రేవంత్ సోదరుడి మృతికి చంద్రబాబు, లోకేశ్ సంతాపం
తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి మృతికి సింగపూర్ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం తెలిపారు. కృష్ణారెడ్డి మరణవార్తను పార్టీ నేతలు ఫోన్ చేసి బాబుకు తెలపగా వెంటనే ఆయన స్పందించారు. అటు టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేశ్ కూడా ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.