: కొత్త డీజీపీ నియామకానికి ఐదు పేర్లు పంపిన టి.ప్రభుత్వం


తెలంగాణ రాష్ట్రానికి త్వరలో కొత్త డీజీపీ నియామకం జరగనుంది. ఈ మేరకు నూతన డీజీపీ నియామకం కోసం ఐదుగురు పేర్లతో కూడిన జాబితాను యూపీఎస్సీకి ప్రభుత్వం లేఖ పంపింది. అనురాగ్ శర్మ, అరుణ బహుగుణ, తేజ్ దీప్ కౌర్, ఏకే ఖాన్, దుర్గా ప్రసాద్ ల పేర్లు అందులో ఉన్నాయి. వారిలో ఏకే ఖాన్, అనురాగ్ శర్మలు డీజీపీ రేసులో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం రాష్ట్ర ఇంచార్జ్ డీజీపీగా అనురాగ్ శర్మ కొనసాగుతున్నారు.

  • Loading...

More Telugu News