: భారత్ ఒక మతానికి చెందిన దేశం కాదు: ఒవైసీ కీలక వ్యాఖ్యలు
భారతదేశ ఆత్మ లౌకికవాదం అని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఈ దేశం ఏ ఒక్క మతానికో చెందినది కాదని చెప్పారు. భిన్న మతాల సమాహారమే భారత్ అని స్పష్టం చేశారు. దేశాన్ని పాలిస్తున్న ఫాసిస్టులకు మౌలిక విధానాలపై కనీస అవగాహన కూడా లేదని మండిపడ్డారు. గతంలో సిక్కులు, ముస్లింలపై జరిగిన దాడులు మళ్లీ పునరావృతం అవుతాయని అభిప్రాయపడ్డారు. దేశంలో ప్రస్తుతం పాలనే లేదని... కేవలం గిమ్మిక్కులు మాత్రమే జరుగుతున్నాయని విమర్శించారు. బైబిల్, ఖురాన్ లు ఇండియా ఆత్మ కాదని కేంద్ర మంత్రి మహేష్ శర్మ అన్న మాటలకు బదులుగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.