: జగన్ దీక్షకు అనుమతించండి... గుంటూరు ఎస్పీకి వైసీపీ నేతల వినతి
ఏపీకి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టనున్న నిరసన దీక్షకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 26న గుంటూరు కేంద్రంగా జగన్ నిరవధిక నిరాహార దీక్షకు దిగుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం నిన్ననే దీక్షా స్థలిని ఎంపిక చేసిన పార్టీ నేతలు ఏర్పాట్లు ప్రారంభించారు. కొద్దిసేపటి క్రితం గుంటూరు జిల్లా ఎస్పీని కలిసిన ఆ పార్టీ నేతలు జగన్ నిరాహార దీక్షకు అనుమతి ఇవ్వాలని వినతి పత్రం అందజేశారు. వైసీపీ నేతల వినతికి ఎస్పీ ఏ విధంగా స్పందించారన్న విషయం తెలియరాలేదు.