: యాపిల్ యాప్ స్టోర్ పై హ్యాకర్ల దాడి... కోట్లాది మంది యూజర్లపై ప్రభావం


ప్రముఖ దిగ్గజ సంస్థ యాపిల్ యాప్ స్టోర్ పై హ్యాకర్లు దాడి చేశారు. డెవలపర్లు ఉపయోగించే ఒక టూల్ ను కాపీ చేశారని, దానికి మార్పులు చేర్పులు చేసి, యాప్ స్టోర్ లోని యాప్స్ లోకి వారి కోడ్ ను ప్రవేశపెట్టినట్టు యాపిల్ పేర్కొంది. ఇంతవరకు నలభై యాప్స్ లో ఇటువంటి కోడ్ లేదా మాల్ వేర్ ఉన్నట్టు తెలిసిందని చెప్పింది. దాంతో కోట్లాది మంది యాపిల్ వినియోగదారులపై ఈ ప్రభావం పడనుంది. యాపిల్ యాప్ స్టోర్ లో ఉన్న 'వుయ్ చాట్' కు దాదాపు 50 కోట్ల మంది వినియోగదారులున్నారు. దాన్ని డౌన్ లోడ్ చేసుకున్న అందరిపై మాల్ వేర్ ప్రభావం ఉంటుందన్నమాట. దాదాపు 300 వరకు యాప్స్ ఇలా ఇన్ఫెక్ట్ అయినట్టు చైనాకు చెందిన ఆన్ లైన్ సెక్యూరిటీ కంపెనీ క్యోహో తెలిపింది. మరోవైపు హ్యాకర్ల దాడి విషయాన్ని యాపిల్ కూడా ధ్రువీకరించింది. నకిలీ సాఫ్ట్ వేర్ మార్చినట్టు గుర్తించిన కొన్ని యాప్ లను ఇప్పటికే తొలగించినట్టు యాపిల్ అధికారి ప్రతినిధి క్రిస్టీన్ మొనాగన్ చెప్పారు. అయితే నిన్న (ఆదివారం) ఇన్ఫెక్ట్ అయిన యాప్ లను ఎంతమంది డౌన్ లోడ్ చేసుకున్నారన్నది తెలియాల్సి ఉంది. ఒక్కసారి మాల్ వేర్ ఉన్న యాప్ ను ఓపెన్ చేస్తే ఫోన్ లేదా ట్యాబ్ లో పూర్తిగా వైరస్ నిండిపోతుంది.

  • Loading...

More Telugu News