: అజ్మీర్ దర్గాలో బాంబు కలకలం...విస్తృత తనిఖీలు
రాజస్థాన్ లోని ప్రఖ్యాత అజ్మీర్ షరీఫ్ దర్గాలో బాంబు ఉందన్న సమాచారం కలకలం రేపింది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని బాంబు స్క్వాడ్ తో తనిఖీలు చేస్తున్నారు. భక్తులను బయటకు పంపించి వేసి విస్తృత తనిఖీలు చేపట్టగా ఎక్కడా బాంబులేదని తెలుసుకున్నారు. ఎవరో ఆకతాయిలు కావాలనే ఫోన్ చేసి బెదిరించినట్టు తెలుసుకున్నారు. 2007లో దర్గా లక్ష్యంగా బయటివైపు ప్రాంగణంలో బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ సమయంలో ముగ్గురు చనిపోగా, 17 మందికి గాయాలయ్యాయి.