: హైదరాబాదులో నడిరోడ్డుపై హత్య... వేట కొడవళ్లతో నరికేసిన ప్రత్యర్థులు


తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాదులో నిన్న రాత్రి దారుణ హత్య చోటుచేసుకుంది. రాత్రి 11 గంటల సమయంలో నగరంలోని రాంకోఠిలో కొందరు వ్యక్తులు ఓ వ్యక్తిని నడిరోడ్డుపై వేట కొడవళ్లతో నరికేశారు. ఈ దాడిలో బాధితుడు ఖాదర్ బాషా అక్కడికక్కడే చనిపోయాడు. వివరాల్లోకెళితే... బొగ్గులకుంటకు చెందిన ఖాదర్ బాషా రాంకోఠిలో సెకండ్ హ్యాండ్ బైకులను విక్రయించే వ్యాపారం చేస్తున్నాడు. నిన్న రాత్రి వ్యాపారం ముగించుకుని కారులో ఇంటికి బయలుదేరాడు. అదే సమయంలో కొందరు వ్యక్తులు అతడి కారును అడ్డగించి కారులో నుంచి ఖాదర్ బాషాను బయటకు లాగి వేట కొడవళ్లతో నరికేశారు. ఏడాది క్రితం వివాహం చేసుకున్న ఖాదర్ బాషా, ఇటీవలే తన భార్యకు విడాకులిచ్చాడట. ఈ క్రమంలో భార్య తరఫు బంధువులే అతడిని చంపేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

  • Loading...

More Telugu News