: మైండ్ దొబ్బిందా? అంటూ నితిన్ నా కాలర్ పట్టుకుని తీసుకెళ్లాడు: అఖిల్


'మైండ్ దొబ్బిందా? ఈ సినిమా చెయ్యరా బాబు' అంటూ నితిన్ తన కాలర్ పట్టుకుని తీసుకెళ్లాడని అఖిల్ చెప్పాడు. 'అఖిల్' ఆడియో వేడుకలో అఖిల్ మాట్లాడుతూ, నితిన్ లేకపోతే ఈ సినిమా లేదని అన్నాడు. సినిమా చెయ్యరాబాబు అంటూ నితిన్ ప్రోత్సహించి ఉండకపోతే చేసేవాడిని కాదని అన్నాడు. వీవీ వినాయక్ సినిమా మామూలు విషయం కాదని చెబుతూ, నితిన్ ఈ కథను తనకు వినిపించాడని అఖిల్ తెలిపాడు. సినిమా కోసం సుధాకర్ రెడ్డి అంకుల్, వినాయక్ అన్న చాలా కష్టపడుతున్నారని అఖిల్ చెప్పాడు. సినిమా కోసం చాలా మంది కష్టపడి పని చేశారని, వారందరికీ ధన్యవాదాలని అన్నాడు. 'బైట్ ఇవ్వండి' అని మహేష్ బాబుగారిని అడిగితే, 'బైట్ దేముంది, నేనే వస్తానని భరోసా ఇచ్చారు. అలాగే వచ్చారు. నన్ను ప్రోత్సహించారు. ఆయన మంచితనానికి ధన్యవాదాలు' అని అఖిల్ అన్నాడు.

  • Loading...

More Telugu News