: బీసీసీఐని శక్తిమంతం చేసిన యోధుడు జగ్ మోహన్ దాల్మియా ఇకలేరు!


బీసీసీఐని ప్రపంచంలో తిరుగులేని శక్తిగా తయారు చేసిన యోధుడు ఇకలేరు. బీసీసీఐ చీఫ్ జగ్ మోహన్ దాల్మియా (75) కన్నుమూశారు. గత వారం గుండెనొప్పితో కోల్ కతాలోని బీఎం ఆసుపత్రిలో చేరిన దాల్మియా ఇంతకు క్రితం అకస్మాత్తుగా మృతి చెందారు. గత కొంత కాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. బీసీసీఐని సుసంపన్నం చేసిన వ్యక్తిగా దాల్మియా విశేషమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. 1940 మే 30న కోల్ కతాలో జన్మించిన ఆయన, క్రికెట్ మాకవెల్లిగా పేరుగాంచారు. భారత్ లో క్రికెట్ ను కార్పొరేట్ సంస్థగా తీర్చిదిద్ది, ఐసీసీని ఛాలెంజ్ చేయగల సంస్థగా తీర్చిదిద్దడంలో దాల్మియాది అశేషమైన పాత్ర. దాల్మియా ఆకస్మిక మరణంపై క్రికెట్ ప్రపంచం సంతాపం వ్యక్తం చేసింది. దాల్మియా మృతి భారత క్రీడా ప్రపంచానికి తీరని లోటని పలువురు అభివర్ణించారు. బీసీసీఐ అధ్యక్షుడిగా పలుమార్లు పని చేసిన దాల్మియా మృతికి బీసీసీఐ సంతాపం ప్రకటించింది.

  • Loading...

More Telugu News