: తమ్ముడు 'అఖిల్'తో హ్యాట్రిక్ కొడతాడు: నాగచైతన్య
'తమ్ముడి సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంద'ని అఖిల్ అన్న నాగచైతన్య ధీమాగా చెప్పాడు. 'అఖిల్' సినిమా ఆడియో వేడుకలో నాగచైతన్య మాట్లాడుతూ, 'అఖిల్ సినిమాతో తమ్ముడు హ్యాట్రిక్ కొడతాడ'ని అన్నాడు. సిసింద్రీ, మనం, అఖిల్... మూడూ బ్లాక్ బస్టర్లేనని నాగచైతన్య చెప్పాడు. అక్టోబర్ లో పండగలన్నీ పక్కనపెట్టి అఖిల్ పండగ చేద్దామని తెలిపాడు. తన తమ్ముడిలో అద్భుతమైన టాలెంట్ దాగుందని అన్నాడు. ముందు ముందు అఖిల్ నుంచి మరిన్ని మంచి సినిమాలు చూస్తారని చెప్పాడు. అఖిల్ సినిమాలన్నీ సూపర్ హిట్ లవుతాయని నాగచైతన్య ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ సమయంలో తాతాగారు ఉండి ఉంటే బాగుండేదని చైతన్య చెప్పాడు. "ఈ జనరేషన్ అమ్మాయిలు అఖిల్ తో ఉంటే, ఇంతకు ముందు జనరేషన్ అంతా నాన్నతో ఉన్నారు...మరి నా సంగతేంటి?" అంటూ చైతన్య నవ్వుతూ ప్రశ్నించాడు.