: అఖిల్ ప్రయాణం ప్రత్యేకం: సుశాంత్


అఖిల్ ప్రయాణం ప్రత్యేకంగా ప్రారంభమైందని యువ హీరో సుశాంత్ అన్నాడు. అఖిల్ అంత్యంత చిన్న వయసులోనే సినీ రంగప్రవేశం చేశాడని, అలాగే హీరోగా రావడానికి ముందే క్రికెటర్ గా సత్తా చాటాడని చెప్పాడు. టాలీవుడ్ జట్టు కెప్టెన్ గా కప్ కూడా అందించాడని గుర్తు చేశాడు. ఆ తరువాత జాతీయ స్థాయి యాడ్ లో నటించాడని, సెలబ్రిటీగా మారిన తరువాతే అఖిల్ సినిమాల్లోకి వచ్చాడని అన్నాడు. పూర్తి స్థాయిలో సినిమాల్లోకి రాకముందే తాతగారితో స్క్రీన్ షేర్ చేసుకున్నాడని కూడా సుశాంత్ చెప్పాడు. అఖిల్ లో చాలా ప్రత్యేకమైన టాలెంట్ ఉందని సుశాంత్ చెప్పాడు. టాలీవుడ్ కి మరో స్టార్ హీరో వచ్చాడని, అందులో అనుమానం అక్కర్లేదని సుశాంత్ తెలిపాడు.

  • Loading...

More Telugu News