: అఖిల్ ని హాలీవుడ్ నుంచి తీసుకొచ్చినట్టుంది!: బండ్ల గణేష్


తెలుగు సినిమాను తన 'బాహుబలి'తో రాజమౌళి హాలీవుడ్ కు తీసుకెళ్తే... అఖిల్ ను హాలీవుడ్ నుంచి తెలుగు సినీ పరిశ్రమకు తీసుకొచ్చినట్టుందని ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కామెంట్ చేశాడు. 'అఖిల్' ఆడియో వేడుకలో బండ్ల గణేష్ మాట్లాడుతూ, తన నటన గురించి విషయాన్నంతా అఖిల్ ఏడాది వయసప్పుడే రుచి చూపించాడని కితాబిచ్చాడు. అఖిల్ పూర్తి సన్నద్ధంగా సినీ రంగంలోకి వచ్చాడని గణేష్ తెలిపాడు. మరో నిర్మాత సి. కల్యాణ్ మాట్లాడుతూ, ఈ సినిమాను తమిళంలో తాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నానని, హాలీవుడ్ రేంజ్ లో తమిళంలో ఆడియో లాంచ్ చేయాలని భావిస్తున్నానని కల్యాణ్ చెప్పాడు.

  • Loading...

More Telugu News