: జయప్రదకు 'నవరస కళాభినేత్రి' అవార్డు అందజేసిన సుబ్బరామిరెడ్డి


ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రదకు పారిశ్రామికవేత్త, కాంగ్రెస్ నేత టి. సుబ్బరామిరెడ్డి 'నవరస కళాభినేత్రి' అవార్డు అందజేశారు. సుబ్బరామిరెడ్డి పుట్టిన రోజును పురస్కరించుకుని 'సుబ్బరామిరెడ్డి లలితకళా పరిషత్' ఆధ్వర్యంలో విశాఖపట్టణంలోని కళావాణి ఆడిటోరియంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు సినీ, రాజకీయ, పారిశ్రామిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సుబ్బరామిరెడ్డి జయప్రదకు 'నవరస కళాభినేత్రి' పురస్కారం అందజేశారు. పలువురు సినీ నటులకు సన్మానం కూడా చేశారు.

  • Loading...

More Telugu News