: మతిస్థిమితంలేని మహిళపై అత్యాచారం


నెల్లూరు జిల్లా ఏఎస్ పేట దర్గా వద్ద దారుణం జరిగింది. మతిస్థిమితం లేని మహిళపై గుర్తుతెలియని వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. చికిత్స నిమిత్తం బాధితురాలని ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై దర్గా ట్రస్టీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ దారుణానికి పాల్పడిన వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు. అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించామని అన్నారు. అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తులను అదుపులోకి తీసుకుంటామన్నారు. ఈ సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News