: కేసీఆర్-చంద్రబాబు మధ్య తేడాలివే!: కేటీఆర్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు లకు మధ్య నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. ఖమ్మంలో ఆయన మాట్లాడుతూ, ఏపీ సీఎం చారణా కోడికి బారణా మసాలా రాస్తాడని, తక్కువ పని చేసి ఎక్కువ బిల్డప్ ఇస్తారని అన్నారు. అదే తెలంగాణ సీఎం ఎక్కువ పని చేసి, తక్కువ ప్రచారం చేసుకుంటారని ఆయన తెలిపారు. మామను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు, మీడియా లక్ష్యంగా రాజకీయాలు నడుపుతారని, అదే కేసీఆర్ 14 ఏళ్లు ఉద్యమం చేసి, చావు నోట్లో తల పెట్టి ప్రజల కోసం పనిచేస్తున్నారని కేటీఆర్ చెప్పారు. ఖమ్మం నేతలు, ప్రజలు ఏపీ సీఎం గురించి పట్టించుకోవడం మానేయాలని ఆయన సూచించారు.