: ఇదో వైచిత్రి... కల్తీ కల్లు దొరక్క మహిళల మృతి!
కల్తీ కల్లు తాగి మృతి చెందడం గురించి విన్నాం, కానీ కల్తీ కల్లు దొరక్క ఇద్దరు మహిళలు మృతి చెందిన ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. గుంటపల్లి, పులిమామిడికి చెందిన ఇద్దరు మహిళలు కల్తీ కల్లుకు బానిసలయ్యారు. గత నాలుగు రోజులుగా కల్తీ కల్లు దొరకకపోవడంతో వారు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీంతో వారిద్దరూ ఈ ఉదయం మృతి చెందారు. కాగా, మహబూబ్ నగర్ ఆసుపత్రిలో 30 మంది, జడ్చర్ల ఆసుపత్రిలో 16 మంది కల్తీ కల్లు బానిసలు చికిత్స పొందుతున్నారు.