: అధికారంలోకి రాగానే బీజేపీ నిజస్వరూపం బయటపడింది: రఘువీరా
అధికారంలోకి రాగానే బీజేపీ నిజస్వరూపం బయటపడిందని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన కిసాన్ ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భూసేకరణపై ఎన్డీయే ప్రభుత్వం వెనక్కి తగ్గడం రైతు విజయమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా, రాజధాని నిధులు, పోలవరం ప్రాజెక్టు, రాయలసీమ, ఉత్తర కోస్తాకు ప్రత్యేక రాయితీలు, ప్రత్యేక ప్యాకేజీని కాంగ్రెస్ పోరాడి సాధిస్తుందని ఆయన పేర్కొన్నారు. బీహార్ ఎన్నికల్లో సోనియా, రాహుల్ ల నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.