: మారిషస్ లో ఘనంగా శ్రీవెంకటేశ్వరుని మహామండల వేడుకలు
మారిషస్ లో శ్రీ వేంకటేశ్వరస్వామి మహామండల దీక్షా శరణాగతి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 14 న ప్రారంభమైన ఈ ఉత్సవాలు అక్టోబరు 22 వరకు జరుగుతాయని నిర్వాహకులు చెప్పారు. ఈ సందర్భంగా సుమారు 12 లక్షల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకునే అవకాశముందన్నారు. పోర్ట్ లూయీస్ లో చిన్నతిరుపతిగా పేరొందిన శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలకు రాష్ట్రానికి చెందిన తెలుగువారు హాజరయ్యారు. భక్తులకు మహాప్రసాదం పంపిణీ చేశారు. ఉత్సవాల సందర్భంగా గాయకులు ఆలపించిన అన్నమాచార్య కీర్తనలు ఆకట్టుకున్నాయి.