: సఫారీ సిరీస్ కు ధోనీకే పగ్గాలు... వన్డే, టీ20 జట్లను ప్రకటించిన బీసీసీఐ


దక్షిణాఫ్రికా టూరుకు వెళుతున్న టీమిండియా వన్డే, టీ20 జట్లకు కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీనే నాయకత్వం వహించనున్నాడు. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం భేటీ అయిన బీసీసీఐ సెలెక్షన్ కమిటీ వన్డే, టీ20 జట్లను ప్రకటించింది. కెప్టెన్ గా మహేంద్రుడినే ఎంపిక చేసిన సెలెక్షన్ కమిటీ సభ్యులు పలువురు కొత్త ఆటగాళ్లకు అవకాశం కల్పించారు. వన్డే జట్టులో ఆల్ రౌండర్ గా గురుకీరత్ సింగ్ కు సెలెక్షన్ కమిటీ అవకాశం కల్పించింది. ఇక టీ20 జట్టులో స్పిన్నర్లు హర్భజన్ సింగ్, అమిత్ మిశ్రాలతో పాటు కొత్త కుర్రాడు ఎస్.అరవింద్ కు చోటు దక్కింది. వన్డే జట్టు: మహేంద్రసింగ్ ధోనీ, శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, అజింక్యా రెహానే, అంబటి రాయుడు, సురేశ్ రైనా, అక్షర్ పటేల్, స్టువర్ట్ బిన్నీ, రవిచంద్రన్ అశ్విన్, గురుకీరత్ సింగ్, భువనేశ్వర్ కుమార్, మోహిత్ శర్మ, అమిత్ మిశ్రా, ఉమేశ్ యాదవ్ టీ20 జట్టు: ధోనీ, శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, కోహ్లీ, రెహానే, రాయుడు, అక్షర్ పటేల్, బిన్నీ, అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మోహిత్ శర్మ, అమిత్ మిశ్రా, ఎస్.అరవింద్

  • Loading...

More Telugu News