: నాపరాళ్లగుంటలో పడి అన్నదమ్ముల దుర్మరణం
కర్నూల్ జిల్లా బనగానపల్లె మండలం పలుకూరులో ఒక విషాద సంఘటన చోటుచేసుకుంది. నిన్న గణేష్ నిమజ్జనం కోసం వెళ్లిన అన్నదమ్ములు నాపరాళ్లగుంటలో పడి మృతి చెందారు. మృతులు తిరుపతి(40), శ్రీనివాస్(35)గా గుర్తించారు. నిమజ్జనం అయిన తర్వాత ఎంతసేపటికీ వీరిద్దరూ కనపడకపోవడంతో గ్రామస్థులకు అనుమానం వచ్చింది. అన్నదమ్ములిద్దరూ మృతి చెందారన్న వార్తతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. వారి కుటుంబసభ్యులు రోదిస్తున్నారు.