: కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు
పశ్చిమ మధ్య, తూర్పు బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం కొనసాగుతోందని వాతావరణ శాఖాధికారులు చెప్పారు. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోందన్నారు. దీని కారణంగా వచ్చే 24 గంటల్లో కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముంది. కోస్తాంధ్రలో ఒకటీ రెండుచోట్ల భారీ వర్షాలు, రాయలసీమ, తెలంగాణలో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు.