: నేతాజీ కుటుంబానికి ప్రధాని కార్యాలయం నుంచి ఎనిమిది రోజుల్లో ఏడు ఫోన్ కాల్స్!


స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మిస్టరీకి సంబంధించిన ఫైళ్లను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రజల ముందు ఉంచిన సంగతి విదితమే. ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడేందుకు అక్టోబర్ 14వ తేదీన బోస్ కుటుంబసభ్యులు ఆయన్ని కలవనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి బోస్ కుటుంబానికి ఎనిమిది రోజుల్లో మొత్తం ఏడు ఫోన్ కాల్స్ వచ్చాయట. నేతాజీ మునిమనవడు చంద్రబోస్ కు నిన్న కూడా పీఎంఓ నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ప్రధాని మోదీని కలవాలనుకుంటున్న తమ కుటుంబ సభ్యుల వివరాలు చెప్పమని చంద్రబోస్ ని అడిగారట. ‘దీనికి సంబంధించిన ఒక అజెండాను పంపించమని పీఎంఓ కోరింది’ అని చంద్రబోస్ చెప్పారు. ప్రధాని మోదీతో జరగనున్న సమావేశంలో బోస్ కుటుంబసభ్యులు 35 మంది, 14 మంది శాస్త్రవేత్తలు, స్కాలర్స్ పాల్గొనే అవకాశముంది.

  • Loading...

More Telugu News