: ఈసారి పారికర్ వంతు... రాహుల్ ఇలాకాలో గ్రామాన్ని దత్తత తీసుకున్న రక్షణ శాఖ మంత్రి


కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రాభవాన్ని తగ్గించేందుకు బీజేపీ నానా పాట్లు పడుతోంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని రాహుల్ పై ఆయన సొంత నియోజకవర్గం అమేథీలో బరిలోకి దించింది. ఎన్నికల్లో ఓటమి పాలైనా రాహుల్ కు మెజారిటీ తగ్గించడంలో స్మృతి ఇరానీ కొంతమేర సఫలీకృతులయ్యారు. ఆ తర్వాత కూడా అమేథీకి అడపాదడపా వెళుతున్న స్మృతి ఇరానీ, ఎప్పటికప్పుడు సరికొత్త కార్యక్రమాలతో అక్కడి ప్రజలను ఆకట్టుకోవడమే కాక రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా స్మృతి ఇరానీకి మరో బీజేపీ నేత, కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ జత కలిశారు. రాహుల్ నియోజకవర్గం అమేథీలోని ఓ గ్రామాన్ని ఆయన దత్తత తీసుకున్నారు. ప్రధాన మంత్రి సంసద్ ఆదర్శ గ్రామ యోజనలో భాగంగా అమేథీ పరిధిలోని బరౌలియా గ్రామాన్ని పారికర్ దత్తత తీసుకున్నారు.

  • Loading...

More Telugu News