: భర్త, కొడుకును పోగొట్టుకున్న ఆ తల్లి ఆవేదన వర్ణనాతీతం!


రెండు రోజుల క్రితం జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదుల తూటాలకు బలైన తండ్రీకొడుకుల సంఘటన గుర్తుండే ఉంటుంది. దాడి జరిగిన కొన్ని గంటల్లోనే మూడేళ్ల బాలుడు బుర్హన్ తండ్రి భట్ మృతి చెందాడు. ఆ మర్నాడు బుర్హన్ కూడా. తన భర్త, కొడుకు మృతి చెందడంతో ఆ తల్లి రోదనలు కాశ్మీర్ లోయలో మార్మోగాయి. బుర్హన్ అంత్యక్రియలు నిన్న నిర్వహించారు. బ్లాంకెట్ లో చుట్టి ఉన్న బాలుడి మృత దేహాన్ని ఒక చిన్న గదిలో నేలపై ఉంచి, వారి మత సంప్రదాయాల ప్రకారం ప్రార్థనలు చేస్తుండటం, బాలుడి మృతదేహానికి వేసిన పూలదండ.. ఈ హృదయ విదారక సంఘటన చూస్తే ఎవరికైనా గుండె బద్దలయిపోతుంది.. ఇక, ఆ తల్లి పడిన బాధ మాటల్లో చెప్పలేం. యాపిల్ పంటకు ప్రసిద్ధి అయిన సోపూర్ టౌన్ షిప్ లో ఉన్నసగిపోరా గ్రామంలో జరిగిన ఈ సంఘటనపై కళ్లు చెమర్చని వాళ్లు లేరనడం అతిశయోక్తి కాదు.

  • Loading...

More Telugu News