: యువనేతపై లైంగిక వేధింపుల కేసు నమోదు


తెలంగాణలో ఒక రాజకీయ పార్టీకి చెందిన యువనేతపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగారెడ్డి జిల్లా పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. వివరాల్లోకెళితే... రంగారెడ్డి జిల్లా కీసర మండలం తిమ్మాయిపల్లికి చెందిన ఓ యువతిపై అదే గ్రామానికి చెందిన సంతోష్ గౌడ్ లైంగిక వేధింపులకు దిగాడు. సంతోష్ గౌడ్ వేధింపులతో చిర్రెత్తుకొచ్చిన యువతి కీసర పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు సంతోష్ గౌడ్ పై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. సంతోష్ గౌడ్ ప్రముఖ రాజకీయ పార్టీ యువజన విభాగం కీసర మండల విభాగం అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు.

  • Loading...

More Telugu News