: గన్నవరం ఎయిర్ పోర్టులో 2 గంటలుగా కదలని విమానం... ప్రయాణికుల ఆగ్రహం
విజయవాడ సమీపంలోని గన్నవరం ఎయిర్ పోర్టులో నేటి ఉదయం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం అక్కడి నుంచి ఢిల్లీ బయలుదేరాల్సిన ఎయిర్ ఇండియా విమానం రెండు గంటలుగా నిలిచిపోయింది. సాంకేతిక లోపం తలెత్తిన కారణంగా విమానం టేకాఫ్ తీసుకోలేదు. దీంతో విజయవాడ నుంచి ఢిల్లీ, అక్కడి నుంచి వివిధ దేశాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు పెద్ద సంఖ్యలో ఎదురుచూస్తూ కూర్చున్నారు. ఎంతకీ విమానం టేకాఫ్ తీసుకోకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రయాణికులు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.