: చంద్రబాబు సర్కారుపై సోము వీర్రాజు ఫైర్... గిరిజనులకు అండగా ఉంటామని ప్రకటన


ఏపీలో టీడీపీ ప్రభుత్వ నిర్ణయంపై మిత్రపక్షం బీజేపీ ఘాటుగా స్పందించింది. ఈ మేరకు ఆ పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు కొద్దిసేపటి క్రితం ఘాటు వ్యాఖ్యలతో కూడిన ప్రకటన చేశారు. పోలవరం ముంపు గ్రామాల్లోని గిరిజలను ఉన్నపళంగా ఖాళీ చేయాలన్న అధికారుల ఆదేశాలతో వీర్రాజు మండిపడ్డారు. గిరిజనుల పట్ల అధికారులు పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పరిహారం చెల్లించే దాకా గిరిజనులు అక్కడి నుంచి కదిలేది లేదని తేల్చిచెప్పారు. ఈ నెల 24 లోగా గ్రామాలను ఖాళీ చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలను వీర్రాజు తప్పుబట్టారు. ఉన్నపళంగా ఖాళీ చేయమని చెబితే గిరిజనుల పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. పరిహారం అందేదాకా గిరిజనులకు బీజేపీ అండగా నిలుస్తుందని వీర్రాజు ప్రకటించారు.

  • Loading...

More Telugu News