: ఇంట్లో పేలిన మందుపాతర... దంపతులు దుర్మరణం


శక్తిమంతమైన మందుపాతర పేలడంతో... ఇంట్లో ఉన్న దంపతులు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ నిమచ్ జిల్లాలోని పిపర్వా గ్రామంలో జరిగింది. ఈ ఘటనలో ఉదరంభిల్, నర్మద అనే గిరిజన దంపతులు ప్రాణాలను కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. మృత దేహాలను పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. అసలు, ఇంట్లోకి మందుపాతర ఎలా వచ్చిందన్న కోణంలో దర్యాప్తును ప్రారంభించారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది.

  • Loading...

More Telugu News