: ఈజిప్టు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన షరీఫ్ ఇస్మాయిల్
ఈజిప్టు దేశ నూతన ప్రధానమంత్రిగా షరీఫ్ ఇస్మాయిల్ నేడు ప్రమాణస్వీకారం చేశారు. అవినీతి ఆరోపణలు చుట్టుముట్టడంతో వారం కిందట అప్పటి ప్రధాని ఇబ్రహీం మెహల్బ్ నేతృత్వంలోని మంత్రివర్గం రాజీనామా చేసింది. మంత్రివర్గంలోని వ్యవసాయ మంత్రి షలాహ్ వాలాల్ అవినీతి ఆరోపణలతో అరెస్ట్ కావడంతో వీరు రాజీనామా చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. దేశాధ్యక్షుడు ఇబ్రహీం మెహల్బ్ వీరి రాజీనామాలను ఆమోదించారు. దీంతో, చమురు శాఖ మాజీ మంత్రి అయిన షరీఫ్ నూతన ప్రధానిగా బాధ్యతలను స్వీకరించారు.