: ముగిసిన టి.కేబినెట్ సమావేశం... వివరాలు


తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం కాసేపటి క్రితం ముగిసింది. దాదాపు నాలుగు గంటలకు పైగా సుదీర్ఘంగా ఈ మీటింగ్ కొనసాగింది. అనంతరం సమావేశ వివరాలను మంత్రి కడియం శ్రీహరి మీడియాకు వివరించారు. వివరాలు... * 2016 మార్చి తర్వాత పగటి పూటే వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ ఇస్తాం. * రూ. 17 వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేశాం. * 2014 జూన్ నుంచి రాష్ట్రంలో 242 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. * ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా రూ. 6 లక్షలకు పెంచాం. * పెరిగిన ఎక్స్ గ్రేషియా నేటి నుంచి వర్తింపు. * ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు కల్యాణలక్ష్మి పథకం వర్తింపు. * ప్రతి 2 వేల హెక్టార్లకు ఒక అగ్రికల్చర్ ఎక్స్ టెన్షన్ అధికారిని నియమిస్తాం. * కేంద్ర నిబంధనలకు లోబడి త్వరలోనే కరవు మండలాలను ప్రకటిస్తాం. * గత ప్రభుత్వాలకు భిన్నంగా రైతులకు ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాం.

  • Loading...

More Telugu News