: జర్మనీలో బాలకృష్ణ దంపతులు


ప్రముఖ సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన సతీమణితో కలసి జర్మనీలో పర్యటిస్తున్నారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ కు నిధులు సేకరించడం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ నేపథ్యంలో, మ్యూనిచ్ సిటీలో ఏర్పాటు చేసిన 'మీట్ అండ్ గ్రీట్' కార్యక్రమంలో ఆయన సందడి చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, బసవతారకం ఆసుపత్రి ఆధ్వర్యంలో చేపడుతున్న పలు కార్యక్రమాల గురించి తెలియజేశారు. అలాగే, తన సినిమాల్లోని పంచ్ డైలాగులను చెప్పి అలరించారు. విరాళాలను అందజేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.

  • Loading...

More Telugu News