: హిందూ దేవాలయం కోసం స్థలం కేటాయించిన యూఏఈ


ఇస్లామిక్ దేశాల్లో అత్యంత అరుదుగా జరిగే సన్నివేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో వాస్తవరూపం దాల్చింది. ఓ హిందూ దేవాలయ నిర్మాణం కోసం యూఏఈ స్థలాన్ని కేటాయించింది. ఇటీవల యూఏఈలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించిన సందర్భంగా, అక్కడి ప్రభుత్వం అబూదాబిలో హిందూ దేవాలయం కోసం స్థలాన్ని కేటాయించింది. దుబాయ్ లో ఇప్పటికే రెండు హిందూ దేవాలయాలు, ఒక సిక్కు గురుద్వారా ఉన్నాయి. అబూదాబీలో మాత్రం ఒక్కటి కూడా లేదు. హిందూ దేవాలయానికి అబూదాబిలో స్థలం కేటాయించడంపై మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు.

  • Loading...

More Telugu News