: 'కబాలి' పోస్టర్ లో రజినీకాంత్ స్టన్నింగ్ గా ఉన్నారు: నటుడు వెంకటేశ్
సూపర్ స్టార్ రజినీకాంత్ ఫోటోతో ఇటీవల విడుదలైన 'కబాలి' తొలి పోస్టర్ ను సినీ నటుడు వెంకటేశ్ మెచ్చుకున్నారు. పోస్టర్ లో రజనీ చాలా బాగున్నారంటూ తన ఫేస్ బుక్ లో వెంకీ పేర్కొన్నారు. "మాస్... సూపర్ స్టార్ లుక్స్ స్టన్నింగ్" అంటూ పోస్టు చేశాడు. రజినీ కాంత్ కథానాయకుడుగా తమిళంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. థాను నిర్మాత. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. రజనీ కాంత్ తో పాటు రాధికా ఆప్టే, ప్రకాశ్ రాజ్ తదితరులు నటిస్తున్నారు.