: వినాయక నిమజ్జనమంటే నాకు ఏడుపొస్తుంది: నటి రేణుదేశాయి


‘ప్రతి ఏడాది వినాయక నిమజ్జనం సమయంలో నా కళ్లు నీళ్లతో నిండిపోతాయి. కానీ, ఈ ఏడాది నాకు తోడుగా ఆకాశం కూడా కన్నీరు పెట్టింది’ అంటూ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ ట్వీట్ చేశారు. మన స్వహస్తాలతో తయారు చేసుకున్న మట్టి వినాయకుడు బొమ్మ కావచ్చు లేదా షాపులో కొనుక్కొచ్చిన గణపతి విగ్రహం కావచ్చు.. ఏదో ఒక దానిని వినాయక చవితి రోజు పూజా మందిరంలో పెట్టుకుని పూజలు చేస్తాము.. భజనలు చేస్తాం..దండాలు పెడతాము..గుంజిళ్లు తీస్తాం, అనుకున్న పని నెరవేరాలని కోరుకుంటాము, ప్రసాదాలు తింటాం..ఇట్లా వినాయక చవితి గడుపుతాం. అంతదాకా బాగానే ఉంటుంది. కానీ, మన చేతులతో తయారు చేసుకున్న వినాయక ప్రతిమను నిమజ్జనం చేసేందుకు తీసుకెళ్లేటప్పుడే చాలా బాధగా ఉంటుందని నటి, దర్శకురాలు అయిన రేణు దేశాయి అంటోంది. ఈ సందర్భంగా తను కారులో వెళుతుండగా దాని అద్దాలపై పడ్డ వర్షపు చుక్కల ఫొటోను పోస్ట్ చేశారు. రేణు దేశాయి పిల్లలు ఎకో ఫ్రెండ్లీ వినాయకుడని విగ్రహాన్ని తయారు చేసిన విషయాన్ని గతంలో ఆమె ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News