: మీ ఫేస్ బుక్ పోస్టింగులే మీ మనస్తత్వాన్ని చెబుతాయి
ఫేస్ బుక్ లో మన రాతలే మన మనస్తత్వానికి నిలువుటద్దాలంటున్నారు లండన్ సైకాలజిస్టులు. ఫేస్ బుక్ లో తరచుగా పోస్టింగ్ చేసేవారి మనస్తత్వాలపై లండన్ లోని బ్రూనైల్ విశ్వవిద్యాలయంలో ఈ మేరకు కొత్త అధ్యయనం నిర్వహించారు. అధ్యయనంలో వెల్లడించిన వివరాలు.. ఫేస్ బుక్ లో రెగ్యులర్ గా పోస్టింగ్స్ చేసే వారు అభద్రతా భావం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తారు. తమ ఆరోగ్యకరమైన జీవన శైలి, వ్యాయామాల గురించి తరచుగా పోస్ట్ చేసేవారికి అహంభావం ఎక్కువ. ఈ కోవకు చెందిన వారు ఎక్కువ లైక్ లు, కామెంట్స్ ఆశిస్తారు. సహజంగా వచ్చే స్పందనననుసరించి ఆయా అంశాలపై ఫేస్ బుక్ లో రాస్తుంటామని బ్రూనై యూనివర్శిటీ సైకాలజీ లెక్చరర్ తారామార్సల్ వెల్లడించారు.