: 'రసగుల్లా' పుట్టుపూర్వోత్తరాలు, నిజానిజాలు తెలుసుకునేందుకు కమిటీలు
ఒడిశా, పశ్చిమబెంగాల్ ప్రభుత్వాల మధ్య కొనసాగుతున్న రసగుల్లా వివాదంపై పూర్తి వివరాలు వెల్లడించేందుకు కమిటీలు ఏర్పాటయ్యాయి. చిన్న, మధ్య తరహా, పెద్ద పరిశ్రమలకు చెందిన వ్యక్తులు, కల్చరల్ విభాగానికి చెందిన సభ్యులతో కూడిన మూడు కమిటీలను ఏర్పాటు చేసినట్టు ఒడిశా మంత్రి ప్రదీప్ పాణీగ్రహి తెలిపారు. రసగుల్లా పుట్టుపూర్వోత్తరాలు, నిజానిజాలపై ఈ కమిటీలు డాక్యుమెంట్లు రూపొందిస్తాయని చెప్పారు. వారంలోగా కమిటీలు తమ నివేదికలను ప్రభుత్వానికి అందించాలని సూచించారు. రసగుల్లా స్వీటు మాదంటే మాదంటూ ఒడిశా, బెంగాల్ రాష్ట్రాలు కొంతకాలంగా గొడవపడుతున్నాయి. అంతేకాదు, పేటెంట్ హక్కుల కోసం కూడా డిమాండ్ చేస్తున్నాయి.